ముళ్ల పొదల్లో రక్షిత మంచినీటి ట్యాంక్

NLR: ఉదయగిరి పట్టణం శివారు కావలి రోడ్డు మార్గంలోని కరెంట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న రక్షిత మంచినీటి ట్యాంకు చుట్టూ ముళ్ల చెట్లు ఏపుగా పెరిగాయి. దీంతో ట్యాంకు దగ్గరుకు వెళ్లి నీరు వదిలేందుకు వీలు లేకుండా ముళ్ల చెట్లు పెరగడంతో కాలనీవాసులు ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి రక్షిత మంచినీటి ట్యాంకు చుట్టూ ఏపుగా పెరిగిన ముళ్ల చెట్లను తొరలించాలని కోరుతున్నారు.