ప్రోటోకాల్ దర్శనాలపై ఈవో కీలక నిర్ణయాలు
BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ప్రోటోకాల్ దర్శనాలపై దేవస్థానం ఈవో వెంకట్రావు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గురువారం దేవస్థానంలోని అన్ని విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించి, ప్రోటోకాల్ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రానున్న మూడు రోజులు ఏజెంట్లు, రిఫరెన్స్ ఫోటో కాల్స్ పూర్తిగా నిషేధించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.