VIDEO: మహారాష్ట్ర వరద బాధితులకు అండగా ఉంటానన్న మంత్రి

JGL: మహారాష్ట్రలో వరదల్లో మృతి చెందిన టి.ఆర్. నగర్ వాసుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. బుధవారం మాజీ మంత్రి జీవన్ రెడ్డితో కలిసి సమీన, హసీనా, ఆఫ్రిన్ కుటుంబాలను పరామర్శించిన మంత్రి, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వపరంగా సహాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.