VIDEO: పాత శ్రీరంగరాజుపురంలో రైతులు ఆందోళన
VZM: గజపతినగరం మండలం పాతశ్రీరంగరాజుపురంలో రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. దేవస్థాన భూములను అధికారులు వేలం వేయడానికి నిర్ణయించడంతో రైతులు నిరసన తెలిపారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు సూచించారు. 70 ఏళ్లుగా సాగు చేస్తున్న వారికి న్యాయం జరిగే వరకూ పోరాటం జరుగుతుందని రైతులు పేర్కొన్నారు.