తిరుపతిలో విషాదం.. ఓ ఇంట్లో మూడు మృతదేహాలు
తిరుపతి సమీపంలోని దామినేడులో విషాదం నెలకొంది. ఓ ఇంట్లో కుళ్లిన మూడు మృతదేహాలు కలకలం రేపాయి. ఇవి తమిళనాడులోని గుడియాత్తంకు చెందిన సత్యరాజ్, పొన్నాగుట్టె నాయగి, మనీశ్ మృతదేహాలుగా పోలీసులు గుర్తించారు. స్థానికులకు దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా.. మృతదేహాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.