శ్రావణ శుక్రవారం.. తిరుచానూరులో భక్తుల రద్దీ

శ్రావణ శుక్రవారం.. తిరుచానూరులో భక్తుల రద్దీ

TPT:  శ్రావణ శుక్రవారం సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఈ రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. కాగా, శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజ కావడంతో భక్తులు తరిలివచ్చారు. ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే అష్టశ్వర్యాలు, సౌభాగ్యం కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.