రోడ్డు ప్రమాదం.. 14 మందికి తీవ్ర గాయాలు
కోనసీమ: కొత్తపేట మండలం గంటి గ్రామంలో ఆదివారం అయ్యప్ప స్వాములు ప్రయాణిస్తున్న బొలెరో వాహనం పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఏలూరులోని రాఘువాపురంకి చెందిన 14 మంది అయ్యప్ప స్వాములు, 8 మంది మహిళలతో కలిసి అప్పనపల్లి, అంతర్వేది ఆలయాలకు వెళ్లి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.