దీక్షా శిబిరాన్ని సందర్శించిన తహసీల్దార్ రామకృష్ణ
E.G: గోకవరం మండల కేంద్రంలో పోలవరం నిర్వాసితులు చేస్తున్న దీక్షా శిబిరాన్ని గోకవరం తహసీల్దార్ రామకృష్ణ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రామకృష్ణ నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తానని, అలాగే కోర్టులో ఉన్న తొమ్మిది ఎకరాలు భూమి ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.