చెత్త తొలగింపు పనులను పరిశీలించిన కమిషనర్

చెత్త తొలగింపు పనులను పరిశీలించిన కమిషనర్

ప్రకాశం: పొదిలి పట్టణం విశ్వనాధపురంలోని జూనియర్ కాలేజ్ గేటు వద్ద కొండలా పేరుకుపోయిన చెత్తను జేసీబీ సాయంతో శుక్రవారం తొలగించారు. చెత్తను తొలగిస్తున్న పనులను కమిషనర్ కేఎల్ఎన్ నారాయణరెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ మారుతీ రావు దగ్గరుండి చెత్త తొలగింపు పనులను పరిశీలించారు. పరిసరాలను శుభ్రం చేయించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.