పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్
KNR: గంగాధర మండలం కురిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రం, గంగాధర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులకు పలు సూచనలు చేశారు.