ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
RR: మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ. 7 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. అలాగే, ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.