నేడు డిండిలో తై బజార్ వేలంపాట

NLG: గుండ్లపల్లి డిండి మండల కేంద్రంలో శనివారం ఉదయం 11 గంటలకు గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో తై బజార్ వేలంపాట నిర్వహించనున్నట్లు పంచాయితీ కార్యదర్శి జంగయ్య ఒక ప్రకటనలో తెలిపారు. వేలంలో పాల్గొనేవారు రూ. 5000 డిపాజిట్ చెల్లించి రసీదు పొందాలని సూచించారు. ఆసక్తి గలవారు దరఖాస్తు ఫారం గ్రామపంచాయతీ కార్యాలయంలో తీసుకోవాలని పేర్కొన్నారు.