ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

KNR: శంకరపట్నం మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన తడిగొప్పుల పోచయ్య కడుపు నొప్పితో బాధపడుతూ గురువారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం కుటుంబసభ్యు లు గమనించి కేశవపట్నం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.