గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

NZB: బాన్సువాడలోని వారాంతపు సంత ప్రాంతంలో ఉన్న వాటర్ ట్యాంక్ సమీపంలోని చిన్న నీటిమడుగులో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు. మృతుడు బోర్లపడి చనిపోయి ఉన్నట్లు పేర్కొన్నారు. మృతుడి ఎత్తు సుమారు 5.6 అడుగులు, చామనచాయ రంగు కలిగి ఉన్నాడన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు కోరారు.