'రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన అవసరం'

'రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన అవసరం'

HNK: రొమ్ము క్యాన్సర్‌పై సమాజంలో సరైన అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ అన్నారు. రెనోవా బన్ను క్యాన్సర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన వాకథాన్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ.. క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే దాని నివారణ సులభమవుతుందని సరైన అవగాహన లేక మహిళలు క్యాన్సర్ బారినపడుతున్నారన్నారు.