'యూరియా కొరత లేదు'

W.G: జిల్లాలో యూరియా కొరత లేదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం అత్తిలి మండలం స్కిన్నెరపురం, కంచుమర్రు, మంచిలి గ్రామాల్లో పర్యటించి గ్రామాల్లోని ఎరువులు దుకాణాలను తనిఖీ చేశారు. సొసైటీలు, ప్రైవేట్ డీలర్లు, మార్కెట్ గోడౌన్లలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయన్నారు. రైతులు అవసరం మేరకు మాత్రమే యూరియాను వినియోగించుకోవాలన్నారు.