మేళ్లచెరువులో స్వయంభు లింగేశ్వరునికి ఘనంగా అభిషేక పూజలు

మేళ్లచెరువులో స్వయంభు లింగేశ్వరునికి ఘనంగా అభిషేక పూజలు

SRPT: మేళ్లచెరువు మండల కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ స్వయంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో ఇవ్వాళ అభిషేక మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆలయ అర్చకులు స్వామివారికి పవిత్ర జలాలు, పంచామృతాలతో విశేష అభిషేకం నిర్వహించి, అనంతరం నయన మనోహరంగా అలంకరించారు.