అర్జీదారులతో ఫోన్‌లో మాట్లాడిన కలెక్టర్
KRNL: 1100 కాల్ సెంటర్ ఫిర్యాదుల పరిష్కారంపై అసంతృప్తి వ్యక్తం చేసిన అర్జీదారులతో జిల్లా కలెక్టర్ సిరి సోమవారం ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తహశీల్దార్లు, సర్వే అధికారులను ఆదేశించారు. సీఎం కార్యాలయం నుంచి వచ్చే అర్జీలను ప్రతి వారం పర్యవేక్షించాలన్నారు.