నేత్రదానంతో వేరొకరికి జీవితం

నేత్రదానంతో వేరొకరికి జీవితం

SKLM: శ్రీకాకుళం నగరంలోని ఇప్పిలి వీధికి చెందిన నారాయణశెట్టి సత్యనారాయణ (86) ఆదివారం మృతి చెందారు. అతని నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకుని మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రానికి చెందిన ఐ టెక్నీషియన్స్ ఆధ్వర్యంలో మృతుడి కార్నియాలు సేకరించారు. నేత్రదానం వేరొకరికి జీవితాన్నిస్తుందని రెడ్ క్రాస్ ఛైర్మన్ జగన్మోహన్ రావు వెల్లడించారు.