అచ్చుం నాయుడుకు ఎమ్మెల్యే పరామర్శ

VZM: నెల్లిమర్ల నియోజకవర్గం మొయిద నారాయణపట్నంలో జనసేన అధ్యక్షుడు అచ్చుం నాయుడుపై వైసీపీ నాయకులు దాడి చేశారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే లోకం మాధవి, చీపురుపల్లి జనసేన ఇంఛార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు బుధవారం పరామర్శించారు. శ్రీనివాసరావు అతనికి రక్షణ కల్పించమని ఎమ్మెల్యేను కోరారు. ఇందులో గుర్ల జనసేన అధ్యక్షులు యడ్ల సంతోష్ పాల్గొన్నారు.