కేయూ గేటు ముందు బీసీ విద్యార్థి నాయకుల దర్నా
HNK: సర్పంచ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గండికొట్టిన జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని, సర్పంచ్ ఎన్నికలను వాయిదా వేయాలని కాకతీయ యూనివర్సిటీ బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ ఆరెగంటి నాగరాజు డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థుల ఆధ్వర్యంలో మంగళవ కేయూ గేటు ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. స్థానిక పోలీసులు వారిని అడ్డుకున్నారు.