పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవు: ఎస్సై
ADB: పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవని ఉట్నూర్ ఎస్సై గుంపుల విజయ్ సోమవారం తెలిపారు. మండలంలోని పులిమడుగు గ్రామ శివారులో ఐదుగురు పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేయగా, ముగ్గురుని అరెస్టు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. వారి వద్ద నుంచి రూ. 2,470 నగదు, రెండు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు SI విజయ్ వెల్లడించారు.