'ప్రజలు ఆరోగ్యం పై దృష్టి సారించాలి'

ADB: సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఆరోగ్యం పై దృష్టి సారించాలని తాంసి PHC వైద్యాధికారి డాక్టర్ శ్రావ్యవాణి అన్నారు. బుధవారం తాంసి మండల కేంద్రంలో వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు. 36 మంది రోగులకు చికిత్స అందించామని ఇద్దరి రక్త పరీక్ష నమూనా సేకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ రాథోడ్ తులసి రాం, ANM, ఆశా కార్యకర్తలు ఉన్నారు.