అమ్మాయితో ఆటోవాలా స్టంట్స్.. డ్రైవర్‌కు కౌన్సెలింగ్

అమ్మాయితో ఆటోవాలా స్టంట్స్.. డ్రైవర్‌కు కౌన్సెలింగ్

HYD: చాదర్ ఘాట్‌లో ఆటో డ్రైవర్, ఓ అమ్మాయిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని డ్రైవింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై సీపీ సజ్జనార్ ఆదేశాల మేరకు పోలీసులు ఆటో డ్రైవర్‌ను గుర్తించి స్టేషన్‌కు పిలిపించారు. ఆ అమ్మాయి మైనర్ కావడంతో తల్లి సమక్షంలో డ్రైవర్‌కు కౌన్సెలింగ్ ఇచ్చారు. రీల్స్ కోసం ఇలాంటి అసభ్యకర వీడియోలు పోస్ట్ చేస్తే చర్యలు తప్పవన్నారు.