మూడు తులాల బంగారం గొలుసు చోరీ

మూడు తులాల బంగారం గొలుసు చోరీ

MNCL: లక్షెట్టిపేట పట్టణంలో చైన్ స్నాచింగ్ జరిగిన సంఘటన కలకలం రేపుతోంది. గురువారం ఉదయం పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద ఒక మహిళ చెట్టుకు పూలను కోస్తున్న సందర్భంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని మూడు తులాల బంగారం గొలుసును దొంగలించాడు. దీనిపై సమాచారమందుకున్న లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి, ఎస్సై గోపతి సురేష్ విచారణ చేస్తున్నారు.