VIDEO: కొండపర్తిలో యూరియా కోసం రైతుల అవస్థలు

VIDEO: కొండపర్తిలో యూరియా కోసం రైతుల అవస్థలు

HNK: ఐనవోలు మండలం కొండపర్తి గ్రామంలో యాసంగి సాగుకు అన్నదాత సిద్ధమైన వేళ యూరియా కొరత రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. పంటలకు సరిపడా ఎరువు అందక సొసైటీ గోదాం, రైతు వేదిక వద్ద యూరియా కోసం శనివారం రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి వరుసల్లో బారులు తీరారు. సరఫరా తక్కువగా ఉండటంతో ఆందోళన వ్యక్తం చేస్తూ వెంటనే యూరియా అందుబాటులోకి తేవాలని రైతులు కోరుతున్నారు.