లింగాలలో ఉపాధి పనులపై గ్రామసభ..!
KDP: 2024-25 సంవత్సరానికి సంబంధించిన ఉపాధి హామీ పథకం పనులపై లింగాల మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో సోషల్ ఆడిట్ బృందాలు పర్యవేక్షణ నిర్వహిస్తున్నట్లు ఏపీవో గంగారాజు తెలిపారు. ఇవాళ రామానుత్తలపల్లిలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీలో పలు జాబ్ కార్డులు ఇంకా అప్డేట్ కాలేదని సోషల్ ఆడిట్ బృంద సభ్యులు పేర్కొన్నారు.