మంత్రిని కలిసిన సత్తుపల్లి మున్సిపల్ పాలకవర్గం

మంత్రిని కలిసిన సత్తుపల్లి మున్సిపల్ పాలకవర్గం

KMM: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సత్తుపల్లి మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కాంగ్రెస్ కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. దమ్మపేట మండల పరిధిలోని గండుగులపల్లిలో మంగళవారం ఉదయం మంత్రి నివాసంలో ఈ భేటీ అయ్యారు. మంత్రి తుమ్మల నూతన పాలకవర్గ సభ్యులను అభినందించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పురపాలక పట్టణం అభివృద్ధికి కృషి చేయాలన్నారు.