సమస్యల పరిష్కారానికి చర్యలు: ఎంపీ

TPT: తిరుపతి నగరంలోని ఎంపీ గురుమూర్తి కార్యాలయంలో శనివారం గ్రీవెన్స్ డే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. ప్రజల నుంచి ఆయన వినతులను స్వీకరించారు. పలు సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.