పాఠాలు చెబుతూ.. అనుకున్నది సాధించా: ఎస్సై

HYD: మొయినాబాద్ ఎస్సై (ప్రొబేషన్)గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జబీనా బేగం వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మక్త వెంకటాపూర్ లోని ఓ పేద కుటుంబంలో పెరిగారు. పాఠాలు చెబుతూ పేదరికం అనే అడ్డు గోడలను దాటి అనుకున్నది సాధించారు. 'నా విజయం, నా స్నేహితులు వారి సహకారం, ప్రోత్సాహంతో సాధ్యమైంది' అని పేర్కొన్నారు. ఆమె చెల్లెలు కూడా కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారని వివరించారు.