ప్రొద్దుటూరు ఎమ్మెల్యేను కలిసిన విద్యుత్ శాఖ SE
KDP: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డిని ఆయన స్వగ్రామం కామనూరులో ఇవాళ కడప సర్కిల్ విద్యుత్ శాఖ SE శ్రీనివాసులు కలిశారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో విద్యుత్ సరఫరా పరిస్థితులపై MLAకి వివరించారు. కొత్త విద్యుత్ సబ్ స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్ల ఏర్పాటుపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు ఈఈ రమణారెడ్డి పాల్గొన్నారు.