రైతులకు ఎమ్మెల్యే గుడ్ న్యూస్

రైతులకు ఎమ్మెల్యే గుడ్ న్యూస్

MBNR: బాలానగర్ మండలంలోని రైతులు తమ పండించిన పత్తిని షాద్‌నగర్ వ్యవసాయ మార్కెట్‌లోని సీసీఐ కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవచ్చని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మంగళవారం తెలిపారు. మండల రైతులకు ఇబ్బందులు కలగకుండా, షాద్‌నగర్ మార్కెట్ సమీపంలోనే ఈ కేంద్రం ఏర్పాటుకు సీసీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తా అంగీకరించారని ఎమ్మెల్యే తెలిపారు.