ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రకాశం: కురిచేడులో వైసీపీ నాయకుడు షేక్ సైదా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. రంజాన్ మాసం శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీక అని నేతలు పేర్కొంటూ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా జడ్పీ ఛైర్మన్ బూచేపల్లి వంకాయమ్మ, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఫిరోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.