VIDEO: జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి స్వామి

ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం గ్రామంలో మంత్రి క్యాంప్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి జాతీయ జెండా ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాజ్యాంగ ప్రతి ఫలాలు సమాజంలోని అట్టడుగు వారికీ అందాలన్నదే అంబేద్కర్ ఆశయమని అన్నారు.