ప్రియుడి మోసం.. యువతి ఆత్మహత్యాయత్నం

ప్రియుడు మోసం చేశాడంటూ ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఆవేశ్ అనే వ్యక్తితో ఆ యువతి నాలుగేళ్లుగా రిలేషన్‌లో ఉంది. అయితే అతడికి ఇదివరకే వివాహం జరిగిందని ఆమెకు తెలియడంతో ప్రియుడి ఇంటికి వెళ్లింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగగా మూడో అంతస్తు నుంచి దూకింది. అదృష్టవశాత్తూ విద్యుత్ తీగల మధ్య ఇరుక్కుని ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.