గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా విడుదల

గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా విడుదల

సత్యసాయ: జిల్లాలోని 467 గ్రామ పంచాయతీల వార్డుల వారీ ముసాయిదా ఓటర్ల జాబితాను డీపీఓ ప్రకటించారు. జిల్లాలో 11,35,917 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 5,69,103 మంది మహిళలు, 5,66,785 మంది పురుషులు ఉన్నారు. పురుషుల కంటే 2,318 మంది మహిళా ఓటర్లే అధికంగా ఉండటం విశేషం. ఈ జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రజల పరిశీలన కోసం అందుబాటులో ఉంచారు.