ఆ రెండు ప్రాజెక్టుల సాధనే YCP లక్ష్యం: మోహన్ రెడ్డి
KRNL: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, గుండ్రేవుల సాగునీటి ప్రాజెక్టులు సాధించే వరకు పోరాటం ఆపబోమని జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. సమాలోచన సమావేశంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు పాల్గొని తమ గళం వినిపించారు.