సంజీవని ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు సమీక్ష
AP: సంజీవని ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నెల రోజుల్లో PPP మెడికల్ కాలేజీ పనులు మొదలు కావాలని అధికారులను ఆదేశించారు. తొలిదశలో మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోనిలో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాలని తెలిపారు. రెండో దశలో మరో 6 మెడికల్ కాలేజీలు నిర్మించాలని సూచించారు. త్వరలోనే ఏపీ స్టేట్ హెల్త్ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీ తీసుకురానున్నట్లు చెప్పారు.