కౌంటింగ్ రోజు.. 144 సెక్షన్
TG: ఈ నెల 14న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం రాబోతుంది. ఈ నేపథ్యంలో HYD యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో అధికారులు కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. దీంతో ఉదయం 6 గంటల నుంచి ఫలితాలు ప్రకటించేంత వరకు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉండనుందని పోలీసులు తెలిపారు. మద్యం దుకాణాలు కూడా బంద్ చేయనున్నారు.