ప్రమాదాలను అడ్డుకునేందుకు 'స్టాప్ వాష్ అండ్ గో'
కోనసీమ: అర్ధరాత్రి, తెల్లవారుజామున జరిగే రహదారి ప్రమాదాలను అడ్డుకునేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం శనివారం వినూత్నంగా స్పందించింది. SP ఆదేశాలతో జాతీయ, రాష్ట్ర రహదారులపై వాహనాలను నిలిపి డ్రైవర్లతో ముఖం కడిగిస్తున్నారు. నిద్రమత్తు వల్ల తలెత్తే ముప్పును తప్పించేందుకు లారీలు, బస్సులు, కార్ల డ్రైవర్లను అప్రమత్తం చేస్తున్నారు.