జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

VZM: అల్పపీడనంతో జిల్లాలో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. శనివారం వేకువజాము నుంచి ఆకాశంలో దట్టంగా మేఘాలు కమ్ముకొని ప్రస్తుతం నిలకడగా వర్షం పడుతుంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 3 గంటల్లో జిల్లాలోని కొన్ని చోట్ల 40-50కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.