ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను పరిశీలించిన MP, MLA
కృష్ణా: గుడివాడ ప్రజల చిరకాల కోరిక అయిన రైల్వే గేట్లపై ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. ఆరు నెలల్లో ఫ్లై ఓవర్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ఆయన ప్రకటించారు. గురువారం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గుడివాడ పట్టణంలో నిర్మితమవుతున్న ఆర్ఓబి నిర్మాణ పనులను పేద కాలవ సెంటర్లో పరిశీలించారు.