ఆర్డీవో కార్యాలయంలో క్యూఆర్ కోడ్ స్కానర్ ఏర్పాటు

AKP: నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ వివి. రమణ సూచనల మేరకు క్యూఆర్ కోడ్ స్కానర్ మంగళవారం ఏర్పాటు చేశారు. ప్రజలు ఎవరైనా తమ దరఖాస్తుల స్థితిగతులు తెలుసుకునేందుకు కార్యాలయానికి వచ్చిన తర్వాత వ్యక్తిగత అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం క్యూఆర్ కోడ్ స్కానర్ ఏర్పాటు చేశారు. స్కానింగ్ చేసిన వెంటనే ప్రశ్నలకు ప్రజలు జవాబు ఇవ్వాల్సి ఉంటుంది.