అరకోరగా ప్రభుత్వ భవనాలు..!

ASR: అనంతగిరి(M) పెదకోట పంచాయతీ కేంద్రంలో సచివాలయం,హెల్త్ సెంటర్,రైతు సేవా కేంద్రం భవన నిర్మాణాలను పూర్తి చేయాలనీ గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన భవనాలు అసంపూర్తిగా దర్శనం ఇస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పంచాయతీ పాడుబడి ఎక్కడికక్కడ వర్షానికి కారిపోతుందనీ గిరిజనులు తెలిపారు. సంబందిత అధికారులు స్పందించి భవనాలు పూర్తి చేయాలనీ కోరారు.