నిరుద్యోగాన్ని అధిగమించాలి: మంత్రి వివేక్
TG: రాష్ట్రంలో ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు(ATC)లుగా అప్‌గ్రేడ్ చేయడం గొప్ప ముందడుగని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. నిరుద్యోగం పెద్ద సవాలుగా ఉందని, దీనిని అధిగమించాలంటే ATCలు ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించాలని సూచించారు. ట్రైనర్ల శిక్షణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ఆశించిన ఫలితాలను సాధించేందుకు ప్రిన్సిపాళ్లు కృషి చేయాలన్నారు.