'పెండింగ్‌లో ఉన్న వేతనాలు విడుదల చేయాలి'

BDK: భద్రాచలం గిరిజన పోస్ట్ మెట్రిక్ హాస్టల్‌లో విద్యను అభ్యసించే విద్యార్థిని, విద్యార్థుల కడుపు నింపే ఔట్‌సోర్సింగ్ కార్మికులపై అధికారులు వివక్ష చూపుతున్నారు. గత 10 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా కార్మికుల కుటుంబాలను పస్తులు ఉంచటం సరైనది కాదని పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ శుక్రవారం డిమాండ్ చేశారు.