ఉపాధి హామీ పనులు ప్రారంభించిన సర్పంచ్
SRCL: వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామంలో సర్పంచ్ దేవరాజు కొబ్బరికాయ కొట్టి ఉపాధి హామీ పనులను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి ఉపాధి హామీ పథకం ఎంతో కీలకమని, ఈ పథకం ద్వారా గ్రామీణులకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు, పాలకవర్గ సిబ్బంది, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.