'వైసీపీకి అధికారమిస్తే రప్పా రప్పా నరికేస్తామంటున్నారు'
W.G: 2029 ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే గంగమ్మ తల్లి జాతరలో పాట్టెళ్ల తలలు నరికినట్లు ప్రజలను నరికేస్తాం అంటున్న వైసీపీ నినాదాలు వారి రాక్షసత్వానికి పరాకాష్ట అని మంత్రి రామానాయుడు ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2019లో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అవినీతి పాలనతో దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని దివాలా తీసారని విమర్శించారు.