ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

PLD: చిలకలూరిపేట 100 పడకల ఆసుపత్రిని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్యసేవలు, ప్రభుత్వం నుంచి అందాల్సిన నిధులపై ఆసుపత్రి వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. రోగులతో మాట్లాడి, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యసిబ్బందికి సూచించారు.