ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు
ప్రకాశం: జిల్లాలోని మూడు డివిజన్ల పరిధిలో ఇవాళ, రేపు ఉపాధ్యాయుల క్రీడలు నిర్వహించనున్నట్లు డీఈఓ రేణుక తెలిపారు. మహిళా ఉపాధ్యాయులకు త్రో బాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని, ఉపాధ్యాయులు పాల్గొనాలని కోరారు. ఒంగోలులోని పీవీఆర్ హైస్కూల్, మార్కాపురంలోని హైస్కూల్, కనిగిరిలోని డిగ్రీ కళాశాల ఆవరణంలో క్రీడలు జరుగుతాయన్నారు.